ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ చూపిన అత్యుతాహం బండ్ల గణేష్ కు తీవ్ర అసహనానికి గురి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను ఎంతో హడావిడి చేసి విడుదల చేద్దామనుకున్న ఎన్టీఆర్ ‘టెంపర్’ ఫస్ట్ లుక్ ఇలా అర్థాంతరంగా తనకు కూడా తెలియకుండా బయటకు రావడం బండ్ల గణేష్ ను తీవ్ర షాక్ కు గురిచేసింది. గత కొద్దిరోజులుగా ఈ ఫస్ట్ లుక్ ను బండ్ల గణేష్ హడావిడితో విడుదల చేద్దామని అనుకున్నా పూరి, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగ్ లో బిజీగా వుండడంతో ఏమీ చేయలేక పోయాడట. గోవాలో షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని బండ్ల గణేష్ ప్లాన్.  ఇది ఇలా ఉండగా ప్రకాష్ రాజ్ భార్య పోని వర్మ ఈ సినిమా ఎడిటింగ్ జరుగుతున్న పూరి ఇంటిలోని కేవ్ నుంచి ఇప్పుడే జూనియర్ ‘టెంపర్’ లుక్ చూసాను అదిరిపోయింది అంటూ పూరి ఇంటి నుంచే తన ట్విటర్ లో ఈఫోటోలు పెట్టి వెబ్ మీడియాకు లీక్ చేసింది. పోని ట్విటర్ లో పెట్టిన ఈ ఫోటోలు మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయి క్షణాలలో అన్ని చోట్ల కనిపించాయి.  తాను నిర్మిస్తున్న సినిమా విషయంలో ఇంత వ్యవహారం జరుగుతున్నా బండ్ల గణేష్ కు ఏమి తెలియక పోవడం ఆశ్చర్యంగా మారింది అని అంటున్నారు. అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పూరి సహకారం తోనే పోని ఈ వ్యవహారం నడిపిందని బండ్ల గణేష్ కు ఒక షాక్ ఇవ్వాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలో పూరి జగన్నాథ్ ఇలా చడీచప్పుడు కాకుండా ‘టెంపర్’ ఫస్ట్ లుక్ విడుదల చేయించాడు అనే టాక్ ఉంది. ఏమైనా తాను నిర్మిస్తున్న సినిమా ఫోటోలు తనకు తెలియకుండానే బయటకు రావడం పూరీకి పెద్ద షాకింగ్ న్యూస్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: