సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఎవర్ గ్రీన్ బ్యూటీ రమ్యక్రిష్ణ. రమ్య క్రిష్ణ ఉంటే చాలు సినిమా బాక్సాపీస్ కి ఫ్రాఫిక్ ఖాయం అనుకున్న రోజులు గత తరంలో ఉన్నాయి. ఆ విధంగా వచ్చిన మూవీలు, ఆ మాటలని నిరూపించి చూపాయి. ఇప్పుడు రమ్యక్రిష్ణ పెళ్ళి చేసుకున్నాక, ఫిల్మ్ ఇండస్ట్రీకి దాదాపు దూరమైంది. కాని గత కొంత కాలంగా తను సెంకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఒకనాటి టాప్ హీరోయిన్స్ అంతా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ఫాంలోకి వస్తున్నారు. ఆ విధంగా రమ్య క్రిష్ణ కూడ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అంతే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో రమ్యక్రిష్ణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ విషయంలో అరవై లక్షలు తీసుకుంటూ నదియా వార్తల్లో నిలవగా, తాజాగా రమ్యకృష్ణ కూడా రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తోంది. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ఆంబళ' సినిమాలో నటించడానికి ఆమె ఏకంగా 90 లక్షలు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ సమాచారం. ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె విశాల్ కు అత్తగా నటిస్తోంది. ఇందుకు గాను రోజు వారీ రెమ్యునరేషన్ 3 లక్షలు చార్జ్ చేస్తుంది. ఈ మూవీకి రమ్యక్రిష్ణ 30 రోజుల డేట్స్ ఇచ్చింది. దీంతో ఈ మొత్తం లెక్కని కలుపుకుంటే ఓ మూవీకి రమ్యక్రిష్ణ తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు కోటి రూపాయలకి టచ్ అవుతుంది. అయితే ఇక్కడ కొంత మంది నిర్మాతలు తెలివిగా ఆలోచించవచ్చు. రమ్యక్రిష్ణ తీసుకునేది రోజుకి మూడు లక్షలే కదా, నాలుగు రోజులు షూటింగ్ పెట్టి సరిపెట్టుకోవచ్చు అని అనుకుంటే పొరపాటే. తను ఒక్కో మూవీకి మినిమం 80 లక్షల ఛార్జ్ చేస్తుందట. సో, కాల్షీట్స్ ని డేట్స్ తో మాట్లాడుకున్నా, గ్రాండ్ టోటల్ గా మాట్లాడుకున్నా తన రెమ్యునరేషన్ మాత్రం నిర్మాతలని వణికిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: