నిన్నా మొన్నటి వరకు దేవుళ్ళను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మకు అనుకోకుండా మరణం గుర్తుకు వచ్చింది. గుర్తుకు వచ్చిన వెంటనే తన అభిప్రాయాలను ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను స్పష్టంగా తెలియచేసి మరో సంచలనానికి తెర తీసాడు వర్మ. తాను అనారోగ్యంతో మంచం పట్టి ఇతరుల మీద ఆధార పడివలసి వచ్చే పరిస్థితి ఏర్పడితే తాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటానని వర్మ ధైర్యంగా చెపుతున్నాడు. అంతేకాదు ఇతరులు తన బాగోగులు చూడటాన్ని తాను కలలో కూడా ఊహించుకోలేనని అంటూ తన మరణం గురించి తనకు ముందుగా తెలిస్తే తాను ఎవరికీ తెలియని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి పోతాను అంటూ మరణం పై కామెంట్లు చేసాడు వర్మ. అంతేకాదు తన డెడ్ బాడీని ఎవరూ చూడకూడదు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెపుతూ చలన రహితమైన తన శరీరం ఎవరి కంటా పడకూడదని కోరుకుంటున్నానని విచిత్రమైన కోరికలలో ఉన్నాడు వర్మ. అయితే మరణం తరువాత ఎవరైనా దేవుడితో కలిసి ఉంటారని ఖచ్చితంగా నమ్మితే డెత్ డేను కూడా బర్త్ డే లా సెలెబ్రేట్ చేసుకోవాలని పిలుపును ఇస్తున్నాడు వర్మ. దేవుడినే నమ్మని వర్మ మరణం తరువాత ఒక మనిషి దేవుడు దగ్గరకు వెళతాడా? అని ప్రశ్నించడం చూస్తూ ఇంతే ప్రస్తుతం వర్మ ఎంత అయోమయ పరిస్థితిలో ఉన్నాడో ఎవరికైనా అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: