బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు దీపక పదుకొనె కి ఘాటు ప్రేమ వ్యవహారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య ఈ యంగ్ హీరో ఒక ప్రముఖ కండోమ్ కంపెనీకి ప్రచార కర్తగా మారి ఆ కంపెనీ కండోమ్స్ కు విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. దీనికోసం పారితోషికం కూడా బాగా భారీగానే ముట్టిందని టాక్. ఈ కంపెనీ కండోమ్స్ ప్రచారంలో భాగంగా రణవీర్ సెక్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. సెక్స్ గురించి బయట బహిరంగంగా మాట్లాడటానికి జనం ఎందుకు మొహమాట పడతారో తనకు అర్ధం కావడం లేదనీ సెక్స్ అనేది ఒక దెయ్యం కానీ లేదా ఒక చెడు విషయం కాని కాదని అది జీవితంలోని ఒక స్వభావ సిద్ధమైన పవిత్ర విషయం అంటూ కామెంట్ చేసాడు.  అంతేకాదు 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ గురించి రహస్యంగా నాలుగు గోడల మధ్య ఎందుకు మాట్లాడుకుంటారో తనకు అర్ధం కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు రణవీర్. అంతేకాదు కామసూత్ర గ్రంధాన్ని రచించిన భారతదేశంలో ఇప్పటికీ చాలామందికి సెక్స్ పట్ల అవగాహన లేకపోవడమే కాకుండా అది సిగ్గుపడే విషయంగా ఇప్పటికీ ప్రవర్తించడం తనకు అర్ధం కావడంలేదని దీని గురించి ఛానల్స్ లో ఎందుకు చర్చా వేదికలు పెట్టరు అని ప్రశ్నిస్తున్నాడు దీపిక ప్రియుడు.  అయితే ఈ హీరో వ్యాఖ్యల పై ముంబాయిలోని చాల మహిళా సంఘాలు రణవీర్ పై ఎదురు దాడి మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: