నిన్న సాయంత్రం చెన్నైలోని కావేరి హాస్పటల్ లో మరణించిన బాలచందర్ మృత దేహాన్ని కడసారి చూపులకు కూడా నోచుకోక పోవడం కమలహాసన్ మనసును కలిచి వేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. బాలచందర్ కు కొడుకు కన్నా ఎక్కువగా వ్యవహరించే కమల్ బాలచందర్ మరణ వార్త తెలియగానే అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుండి బయలుదేరినా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఈరాత్రికి కాని చెన్నై చేరుకోలేని నేపధ్యంలో కమలహాసన్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న బాలచందర్ అంత్యక్రియలకు అందుకోలేక పోతున్నాడు.  ఈరోజు ఉదయం నుండి బాలచందర్ భౌతిక కాయాన్ని కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్ళి చివరి అంజలి ఘటించారు. కేవలం పెద్ద తరం నటీనటులే కాకుండా కోలీవుడ్ కు చెందిన ప్రతి వ్యక్తి బాలచందర్ మృతదేహానికి అంజలి ఘటించాడమే కాకుండా కంట కన్నీరు పెడుతూ బాలచందర్ తో తమకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.  ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం బాలచందర్ అత్యక్రియలు రేపు జరగవలసి ఉన్నా ఈరోజు కోలీవుడ్ సినిమా పరిశ్రమకు సెలవు ప్రకటించిన నేపధ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలచందర్ అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. కమల్ హాసన్ ను నటుడిగా 1973 లో సినిమా రంగానికి పరిచయం చేసిన బాలచందర్ కేవలం కమలహాసన్ తో దాదాపు 40కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు అంటే గురు శిష్యుల లాంటి వీరి ఇద్దరి అనుబంధం ఆ బందాన్ని దాటి తండ్రి కొడుకుల అనుబంధంగా మారిపోయింది. బాలచందర్ ను దైవంగా భావించే కమల్ ఆయన భౌతిక దేహాన్ని చివరి చూపుకు కూడా నోచుకోక పోవడం అత్యంత బాధాకరం.  నుదుట వీభూది రేఖలతో స్వచ్చమైన తెల్ల బట్టలతో ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే బాలచందర్ ఇక కనుమరుగు అయిపోతూ ఉండటంతో ఒక శకం ముగిసిపోతోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: