సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా సీక్వెల్స్ విజయవంతం అవుతాయి. అలాంటి వాటిలో సూర్య నటించిన సింగం మూవీ కూడ ఒకటి. సింగం సినిమాలు రెండు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . సూర్య హీరోగా హరి దర్శకత్వం లో వచ్చిన సింగం, సింగం 2 సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించాయి. దర్శకుడు హరి కూడ సింగం సీక్వెల్స్ పై ఆసక్తి చూపుతున్నాడు.యాక్షన్ చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడనిపించుకున్న హరి ఇటీవల సూర్యాని కలసి ఓ కథ వినిపించాడట. వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సింగం3 కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సింగం3 ని తమిళ, తెలుగు భాషలలో నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘మాస్’ సినిమా పూర్తవగానే ఈ చిత్రం పట్టాలేక్కనుంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మాస్ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. నయనతార, ప్రణీత హీరోయిన్స్. ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధపడుతుంది. అయితే సింగం3 లో ఆసక్తికర విషయం ఏమిటంటే , ఈ మూవీలో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కి చెందిన మరో టాప్ హీరో నటించే అవకాశం ఉంది. సూర్య సరసన సింగం3లో, స్ర్కీన్ స్పేస్ పంచుకోవటానికి విశాల్ రెడీగా ఉన్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ని అఫిషియల్ గా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: