విక్టరీ వెంకటేష్ మరో ప్రయోగంతో ముందుకు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రీమేక్స్ సినిమాల పై ఆధారపడుతూ మల్టీస్టారర్ మూవీలతో ముందుకు వస్తున్న వెంకటేష్ ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వెంకీ రీమేక్ చేయబోతున్నది ఒక తమిళ సినిమా అని టాక్.

ఫిలింనగర్ లో వినపడు తున్న సమాచారం ప్రకారం గతఏడాది కోలీవుడ్ లో విడుదల అయి హిట్ అయిన 'సలీం' మూవీ దర్శకుడు ఎన్.వీ. నిర్మల్ కుమార్ డైరెక్షన్‌లో వెంకీ తర్వాతి సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని టాక్. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని అంటున్నారు.

ఈ సినిమా పేరును 'డా. సలీమ్' గా నిర్ణయించారని తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన నిర్మల్ కుమార్ దర్శకుడిగా మారి తీసిన సలీం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

గత ఏడాది విడుదల అయిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ అంటోనీ హీరోగా నటించాడు. ఒక సైకో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలోని డాక్టర్ పాత్ర తనకు బాగా నప్పుతుందని వెంకటేష్ భావించడంతో ఈ రీమేక్ పై మనసు పడుతున్నాడు అని ఫిలిం నగర్ టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: