ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ తో ప్లస్సులు ఎంత ఉన్నాయో మైనస్ లు కూడా అంతే ఉన్నాయి. ముఖ్యంగా చేతిలో ప్రపంచం అదే నండి సెల్ ఫోన్ ప్రస్తుతం వస్తున్న అత్యాధునికమైన సెల్ సామాన్యులకు సైతం అందుబాటులో వస్తున్నాయి. ఈ సెల్ మంచికి ఉపయోగిస్తే ఓకే మరి ఎంతమంది అలా చేస్తున్నారు.

దీంతో పాజిటీవ్ ఉపయోగాలు కొన్నైతే నెగిటీవ్ ఉపయోగాలే చాలా ఉన్నాయని ముఖ్యంగా ఆకతాయిలు ఈ సెల్ ఫోన్లతో సమాజంలో చాలా మందిని ఇప్పందిపెడుతున్నారని తెలియవచ్చింది. సెల్ తో మెసేజ్ ల ద్వారా కూడా చాలా మంది చాలా రకాలు గా బాదపడతుంటారు.

తాజాగా బాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా అందరినీ గజగజలాడించిన వాడు శక్తికపూర్. తనదైన మేనరీజంతో కామెడీ, విలన్ గా మంచి పాపులారిటీనే సంపాదించుకున్నారు. అలాంటి శక్తి కపూర్ ని మెసేజ్ లతో చంపేశారు. వాట్ అదేంటీ అనుకుంటున్నారా ? అవునండీ మనోడు ఖండాలా వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శక్తికపూర్ దుర్మరణం చెందాడని కొందరు ఆకతాయిలు ‘వాట్సప్’లో మెసేజ్ పుట్టించారు.

ఈ మెసేజ్ శరవేగంగా బాలీవుడ్ అంతటా పాకింది. దీంతో శక్తికపూర్ ఫోన్‌కు శనివారం వేకువ జామునే సంతాప సందేశాల వెల్లువతో పాటు, సన్నిహితుల నుంచి ఫోన్‌కాల్స్ మొదలవడంతో అందరికీ పేరు పేరునా తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకోవడానికి నానా తంటాలు పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: