సినీ ఇండస్ట్రీ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ , దర్శకుడు విన్సెంట్ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు, తమిళం,మలయాళి ,హిందీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.ఆయన సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. విన్సెంట్ మళయాళంలో దర్శకత్వం వహించిన బార్గవి నిలయం సినిమాకు పలు అవార్డులు వచ్చాయి.విన్సెంట్ మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన విన్సెంట్ చైన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విన్సెంట్ 1928లోకేరళలోని కాలికట్‌లో జన్మించారు. 1953 లో చంఢీరాణి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సినిమాటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

ఏ సన్ని వేశానికి ఎలా తీయాలో నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ లైటింగ్ మీద మంచి పట్టున్నఛాయా గ్రహకుడిగా అనాడు విన్సెంట్ కి చాలా పేరుంది. విన్సెంట్ సినీ ప్రయాణంలో దక్షిణాది అగ్రతారలైన ఎన్టీఆర్, కృష్ణ, మురళీమోహన్, అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్‌లాల్, మమ్ముట్టీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ప్రేమ్‌నగర్, అల్లుడుగారు, అల్లరిప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, అడవిరాముడు, అన్నమయ్య వంటి హిట్ చిత్రాలతోపాటు పలు హిట్ సినిమాలకు పనిచేశారు. ప్రేమ్‌నగర్ సినిమాకు గాను విన్సెంట్‌గారికి 1974లో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: