తెలుగు చలన చిత్ర సీమలో మకుటం లేని మహరాజులా వెలిగిన నటులు యన్.టీ.ఆర్., ఏ.ఎన్.ఆర్. ఒక దశలో చెప్పాలంటే తెలుగు చిత్ర సీమకు వీరుద్దరు సూర్య,చంద్రులు, రెండు కళ్ల లాంటి వారు అని చెబుతారు. నటన అనేది తెచ్చి పెట్టుకుంటే రాదని అది అణువణువూ ఉండాలనే అభిప్రాయం కలిగిన వారు ఈ మహానటులు. అయితే నటనా రంగంలో ఇద్దరూ హేమాహేమీలే అయినా ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవం. ఎలాంటి పొరపొచ్చాలకు తావివ్వకుండా కళామతల్లికి ముద్దు బిడ్డలుగా నిలిచిన మహా నటులు.

Image result for sr ntr anr

యన్.టీ.ఆర్. గురించి ఏ.ఎన్.ఆర్ అన్న మాటలు కొన్ని చూద్దాం.. అద్భుతాలు జరుగుతాయే తప్ప సృష్టించలేం.. అలాంటి అద్భుతమే నందమూరి తారక రామారావు.. నట కులానికి చెందినవారందరికీ ప్రాత:స్మరణీయుడాయన. నేను ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి ప్రవేశించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటికి నాకు నా సహ నటులకు ఎలాంటి సంచలనమైన పోటేలేదు. యన్.టీ.ఆర్. గారు ఆయన స్పురధ్రూపం, ఆజాను బాహు శరీరం, సుమధురమైన గంభీరమూ అయిన గళం, ఏ వైపు నుంచి చూసినా అందగాడనిపించే సౌందర్యం.

Image result for sr ntr

వీటన్నిటిని ఆయనతో పోల్చుకొని అన్నింటికీ నేను జీరో మార్కులు వేసుకున్నాను. అంతే కాదు తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే భవిష్యత్ లో ఏ.ఎన్.ఆర్. ఉండడేమో అనిపించేది. అలా అని ఆయన నాకు ఎప్పుడూ పోటీ తత్వం ప్రదర్శించేవారు కాదు అంత మృదు స్వభావి. కాకపోతే యన్.టీ.ఆర్. ను చూసి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉండేవి అవే మంచి పాత్రలు అంతకు తప్ప మరో మార్గం లేదు.

Related image

నాకు తెలిసి ఇన్ని ప్లస్ లు ఉన్న నటుడు నాకు ఏ భాషలోనూ కనిపించలేదు. యన్.టీ.ఆర్. వంటి మహాగ్రశిఖరం పరిశ్రమలో ఉండబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తమై నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోగలిగాను అని నిర్మోహమాటంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: