నిన్న దేశమంతా అత్యంత ఆనందంగా హోలీ పండుగ సంబరాలలో మునిగి తేలిపోతే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు కలిగిన రజినీకాంత్ మాత్రం తీవ్ర వేదనతో హోలీ పండుగను జరుపుకున్నాడు. ప్రతి హోలీ పండుగ నాడు రజినీకాంత్ చేసే ఒక పని నిన్న చేయలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

బస్ కండక్టర్ గా ఉన్న తనకు సినీ జీవితాన్ని ఇవ్వడమే కాకుండా శివాజీ రావు గైక్వాడ్ అనే తన పేరును రజనీకాంత్ గా నామకరణం హోలీ రోజున రజినీ గురువు బాలచందర్ మార్చేశాడు. ఈ సంఘటన జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ప్రతి హోలీ పండుగ రోజునా రజినీ బాలచందర్ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం రజినీకి అలవాటు.

అయితే ఈ మధ్యనే బాలచందర్ చనిపోవడంతో ఈసారి రజినీ హోలీని జరుపుకోకుండా ఆయన జ్ఞాపకాలలో గడిపాడట. 1975వ సంవత్సరంలో శివాజీ రావు అనే రజనీకాంత్ ను బిగ్ స్క్రీన్ కు పరిచయం చేద్దామనుకున్నపుడు బాలచందర్ రజనీకాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే మూడు పేర్లను ఆలోచించి దేవుడి దగ్గర చీటీలు తీస్తే రజినీకాంత్ అన్న పేరు వచ్చిందిట.

దీనితో శివాజీ రావు రజినీకాంత్ గా మారిపోయి దక్షిణాది సినిమా రంగానికి టాప్ హీరోగా మారిపోయాడు. గురు శిష్యులుగా కాకుండా తండ్రి కొడుకుల అనుబంధానికి మించి కొనసాగిన రజినీ బాలచందర్ ల అనుబంధం నేటి తరం హీరోలకు ఆదర్శంగా నిలబడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: