తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు నందమూరి హీరోలు మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ‘జిల్లా’ రీమేక్‌లో నటించనున్నారని సినీ వర్గాల సమాచారం. ‘జిల్లా’ తెలుగు రీమేక్‌లో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయంలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది.

నిన్నటి వరకూ వెంకటేష్, రవితేజలు ఈ రీమేక్‌లో నటిస్తున్నారనే వార్త రాగా, ఇప్పుడు తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ వచ్చిపడింది. విజయ్, మోహన్‌లాల్‌లు నటించిన తమిళ సినిమా ‘జిల్లా’.. గత సంవత్సరం పొంగల్‌కు విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే జిల్లా తెలుగు రీమేక్‌కు సముద్ర పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

గత కొంత కాలంగా కళ్యాణ్ రామ్ ఓ మంచి మూవీని రిమేక్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అందులోని భాగంగానే జిల్లా మూవీని చూసి, ఆ మూవీలో తను, బాలక్రిష్ణ ఇద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందంట. దీంతో కళ్యాణ్ రామ్ వెంటనే బాలక్రిష్ణకి జిల్లా మూవీకి సంబంధించిన స్టోరిని చెప్పి, కన్విన్స్ చేయించినట్టుగా తెలుస్తుంది.

దీంతో కొద్దిపాటి చిన్న చిన్న మార్పులతో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. బాబాయ్ బాలయ్యతో నటించాలన్న ఆసక్తిని పటాస్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: