ఈ మధ్య ప్రతి సినిమాలో అంటే కమర్షియల్ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. పాశ్చాత్య సినిమాల మోజులో పడి బాలీవుడ్ కి ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ కి పాకిపోయింది. తాజాగా తెలుగులో వస్తున్న ‘జిల్ ’ సినిమా లో రొమాంటిక్ సీన్లకు కొదవే లేదంట.

ఈ మధ్య సినిమాకు సంబంధించిన ట్రయిలర్ రిలీజ్ అయ్యింది ఈ ట్రైలర్లో గోపిచంద్ రాశిఖన్నాతో లిప్ లాక్ సన్నివేశం కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఉంది. రాశిఖన్నా ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.

మొత్తానికి ఈ సినిమాను మాంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లుంది రాధ కృష్ణ అన్నారు. ఇప్పటివరకు మాస్ హీరోగా ఉన్న గోపీచంద్ ఈ సినిమాతో రొమాంటిక్గా మారిపోయాడు. హేర్ స్టైల్, డ్రెస్సింగ్ అన్ని కూడా మార్చేశాడు. మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ను మిర్చి సినిమాతో న్యూ లుక్లో చూపించిన యువి క్రియేషన్స్ ఇప్పుడు గోపీని కూడా కొత్తగా చూపించింది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: