మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి మొదటి నుంచి ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో  పవన్, మహేష్ బాబు వస్తారని సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేసినప్పటికీ అది జరగలేదు. తర్వాత ఆడియో వేడుకలకు పాస్ ఇచ్చి కూడా తమను రానీయలేదని కొందరు అభిమాను కేసులు కూడా పెట్టారు.


విడుదలకు సిద్ధమైన రేయ్ మూవీ పోస్టర్


ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేస్తామని చెప్పారు. కానీ మెగా మేనల్లుడు సాయిధర్మ తేజ్ పెండింగ్ సినిమా రేయ్ ఈ నెల 27 న విడుదల అవుతుంది. ఇప్పటికే నానా కష్టాలు పడుతూ వస్తున్న సినిమా రేయ్ మరి వెంటనే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వస్తే రేయ్ మీద ఉన్న అంచనాలు తారుమారై పోతాయి. అసలే   భారీ బడ్జెట్ తో ఆ చిత్రం రూపొందడం తో ఆ మొత్తం రికవర్ కావాలంటే కనీసం రెండు ,మూడు వారాల పాటు కలెక్షన్లు కుమ్మేస్తే కాని బ్రేక్ అవదు.


సన్నాఫ్ సత్యమూర్తి లో అల్లు అర్జున్ పోస్టర్


మరి వెంటనే  సన్నాఫ్ సత్యమూర్తి రిలీజ్ అయితే మొదటికే మోసం వస్తుందని భావించిన చౌదరి అల్లు అర్జున్ తో పాటు దర్శకులు త్రివిక్రమ్ ని అభ్యర్దించడంతో మెగా మేనల్లుడు కాబట్టి తమ సినిమాని వాయిదా వేయడానికి నిర్ణయించు కున్నారట. దీంతో  సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఏప్రిల్ 9న విడుదల చేయాలని ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. మరి  ఈ సినిమా అప్పుడైనా విడుదల అవుతుందా..? లేదా అని అల్లు అర్జున్ అభిమానులు తెగ బాధపడుతున్నాట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: