‘ఆనంద’ సినిమా తరువాత రాజా క్లాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకి ఓ చక్కని నటుడు దొరకాడని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఆ తరువాత ‘వెన్నెల’లో ఫర్వాలేదనిపించిన నటనతో యూత్ కి చేరువయ్యాడు. ఆ తరువాత... రాజా సినిమాలు సినిమాలు చేస్తున్నాడు. వస్తున్నాయి... వెళ్తున్నాయి... నిలదొక్కుకో లేకపోయాడు.  ప్రస్తుతం రాజాకి ఉన్న ఇమేజ్ ఏంటి... యూతా... క్లాసా.. మాసా అంటే, ‘యూతే’ అంటున్నాడు. ఆ ఇమేజ్ ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ మధ్య యూత్ ఫుల్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఇపుడు రాజా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘హాస్టల్ డేస్’, ‘పార్కింగ్’ చిత్రాలు రెండూ యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్లే అంటున్నాడు. ఇటీవలే బర్త్ డే జరుపుకున్న ఈ బర్త్ డే బాయ్ ఈ రెండు సినిమాలూ తనకి కచ్చితంగా లక్కును తెచ్చిపెడతాయని ఆశిస్తున్నాడు. వాస్తవం కూడా అదే.... ఈ రెండు చిత్రాలే రాజా కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: