రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. లేకపోతే, బాలీవుడ్ అవకాశం ఇంత త్వరలో రావడమేంటి... అందులోనూ ప్రియాంకా చోప్రా సరసన నటించే అద్రుష్టం దక్కడమేంటి? అమితాబ్ బచ్చన్ కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన జంజీర్ సినిమాను రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా కాగా, ప్రధానపాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.  ఈ చిత్ర షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రియాంకా చోప్రా హైదరాబాద్ కు వస్తోంది. షూటింగ్ సుమారు 25 రోజులపాటు హైదరాబాద్ లో జరుగుతుంది. అప్పటివరకూ ప్రియాంకా ఇక్కడే ఉంటుందట. అంటే ప్రియాంక కొన్నాళ్లు భాగ్యనగరంలోనే ఉండబోతుందన్నమాట. ఈ అవకాశాన్ని మెగా ఫ్యామిలీ సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసేసింది.  నాయక్ ఆడియో విడుదల ఈ లోగా పెట్టి అందులో వేదికపై ప్రియాంకను పరిచయం చేసి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ఆశపడుతోంది. మరోపక్క... సంజూ బాబా మాత్రం ఒక్కరోజు షూటింగ్ కోసమే ఇక్కడకు వస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: