తెలుగులో అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మళియాల కుట్టి ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. నిత్యా ఈ మధ్య కాస్త బిజీ బిజీగానే గడుపుతుంది. ఈ మద్య విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి లో కీ రోల్ పోషించింది. రుద్రమదేవి సినిమాలో అనుష్క కూతురిగా నటించింది.  ఇప్పుడు ‘ఓకే బంగారం లేదా ఓకే కన్మణి’ ఈ నెల 17న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే సక్సెఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నిత్యా మీనన్ కి ఓ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది. మరి దీన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 


నిత్యా మీనన్ స్టిల్


మరి ఆ స్టార్ ఎవరనే అనుకుంటున్నారా..? ఇంకెవరండీ మన  తల అజిత్. అజిత్ హీరోగా శౌర్యం, వీరం ఫేం శివ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లే యోచనలో ఉంది. ఈ సినిమా పూర్తిగా అన్నా చెల్లెల్ల అనుబంధం గురించే ఉందట. ఆ క్యారక్టర్స్ కి అజిత్, నిత్య అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని దర్శకులు భావిస్తున్నారు. అందుకే నిత్యను సంప్రదించారు.   ఒక వేల నిత్యా మీనన్ నో చెబితే శ్రీ దివ్యని కూడా అప్రోచ్ అవ్వాలని ఈ చిత్ర టీం ఆలోచిస్తోంది. మరి నిత్యా మీనన్ అజిత్ కి సిస్టర్ గా నటించడానికి అంగీకరిస్తుందా.? లేకా ఆ ఛాన్స్ ఇంకెవరికన్నా ఇస్తుందా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: