పవన్ కల్యాణ్.. ఈయన ఏం చేసినా సంచనలనమే.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటింది. తమ అభిమాన నటుడికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీనికితోడు ఇప్పట్లో పవన్ గురించిన కొత్త సినిమాల వార్తలు కూడా పెద్దగా రావడం లేదు. 

మిగిలిన హీరోల్లా  పవన్ కేవలం తెరకే పరిమితమైన నటుడు కాదు.. ఆయనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. నేరుగా ప్రధాని మోదీతోనే మాట్లాడే చనువుంది. ఏపీ ముఖ్యమంత్రితోనూ అంతే క్లోజ్ రిలేషన్ ఉంది. అందుకే.. పవన్ కు సంబంధించిన ఏ ఇష్యూ అయినా.. హాట్ టాపిక్ అవుతోంది. 

లేటెస్టుగా ఓ అభిమానిని పవన్ కల్యాణ్ కలవడం ఆసక్తిరేపింది. ఇది రొటీనే అయినా.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ లుక్.. అభిమానులకు ఒక రకంగా షాక్ ఇచ్చింది. బాగా గడ్డం పెంచేసిన పవన్.. అభిమానుల బుర్రలకు పని పెట్టాడు. 

పవన్ ఎందుకు గడ్డం పెంచాడు.. ఏదైనా కొత్త సినిమా కోసం గడ్డం పెంచుతున్నాడా.. తీరకలేక.. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల గడ్డం అలా పెరిగిపోయిందా.. ఈ గడ్డం వెనుక ఉన్న కథేంటో తెలుసుకోవాలని వారు ఊవిళ్లూరుతున్నారు. పవన్ గతంలో గడ్డం లుక్ తో వచ్చిన పంజా అంతగా హిట్ కాలేదు. మళ్లీ పవన్ గడ్డంలుక్ తో ఏదైనా సినిమా తీస్తే.. దాని ఫలితం ఎలా ఉంటుందో.. ఇలా సాగిపోతున్నాయి.. అభిమానులు ఆలోచనలు. మరి ఈ గడ్డం లుక్ పై పవన్ క్లారిటీ ఇస్తే బావుంటుందేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: