పాల్ లో సంభవించిన భారి భూకంపంలో తెలుగు సినిమా ‘వెటకారం.కామ్’ టీం మెంబర్స్ చిక్కుకున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విజయ్ మృతి చెందారు. షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ మృతితో అతని కుటుంబంతో పాటు బాపట్లలో విషాదం నెలకొంది. షూటింగ్‌ కోసం నేపాల్‌ వెళ్లిన ఎటకారం సినిమా యూనిట్‌ ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోగా ఓ విషాద వార్త తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోగా చేసిన విజయ్ కారు భూకంప ధాటికి తిరగబడి మృతి చెందినట్లు మీడియా వర్గాల సమాచారం.


చిత్ర యూనిట్ తో విజయ్


ఆయన ఆ సమయంలో కారులో ప్రయాణిస్తుండగా, భూ కంపం ధాటికి కారు ప్రమాదానికి గురైంది. దాంతో విజయ్ మరణించినట్లు సమాచారం వచ్చింది.గుంటూరు జిల్ల బాపట్ల విజయ్ స్వస్థలం.నేపాల్ భూకంపం జరిగినప్పుడు ఎటకారం చిత్ర యూనిట్ సభ్యులు అక్కడే ఉన్నారని వార్త వచ్చింది. తొలుత వారంతా సురక్షితం అని భావించినా, విజయ మరణించారన్న వార్త సినీ రంగంలో విషాదం కలిగించింది.


కారు ప్రమాదం మరణించిన నటుడు గా భావిస్తున్న చిత్రం?


విజయ్ తండ్రి స్టీలు సామానుల వ్యాపారం చేస్తుంటారు. బాపట్ల మార్కెట్ ప్రాంతంలో నివాసముంటున్న విజయ్ నృత్యంపై మక్కువ చూపేవాడనీ, అదే అతడిని నృత్య దర్శకుడిని చేసింది. . 25 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ్ కు ఇదే తొలి చిత్రం.విజయ్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: