రాజమౌళి తాజా చిత్రం బాహుబలి విడుదల అంశం జీడిపాకంలా సాగిపోతోంది. సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. అత్యున్నత సాంకేతిక విలువలు.. భారీతనం.. భారీ గ్రాఫిక్ వర్క్ కారణంగా పోస్ట్ ప్రోడక్షన్ కు చాలా సమయం తీసుకుంటోంది. 

మళ్లీ విడుదల వాయిదా..?


ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. విడుదల కోసం పురిటి నొప్పులు పడుతోంది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు స్వయంగా రాజమౌళి ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా చెప్పేశారు. వాస్తవానికి ఈ సినిమాను మే 15వ తేదీన విడుదల చేయాలని భావించారు. 

బాహుబలి కోసం 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో.. 600 మంది నిపుణులు..  రోజుకు రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారట. అయినా సమయానికి పూర్తి చేయలేకపోతున్నామని రాజమౌళి బాధపడుతున్నారు. అందుకే.. బాహుబలి మొదటి భాగాన్ని జూలై నెలలో విడుదల చేస్తామని రాజమౌళి చెబుతున్నారు. 

జాప్యం.. మొదటికే మోసమా..?


మే 31వ తేదీన ట్రైలర్ మాత్రం విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు.. ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లన్నింటినీ మే 1 నుంచి మే 31 వరకు దశలవారీగా విడుదల చేస్తారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: