కోలీవుడ్ హీరో సూర్య తన మార్కెట్ ను టాలీవుడ్ లో పెంచుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. ఈ నేపధ్యంలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవడానికి సూర్య అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసారి సూర్య ఏకంగా తన క్రేజ్ పెంచుకోవడం కోసం చిరంజీవిని టార్గెట్ చేస్తున్నాడు.

ఈనెల మే 15న విడుదల కాబోతున్న సూర్య ‘మాస్’ సినిమాకు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడ మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అయితే ఈసినిమా టాలీవుడ్ లో మంచి సక్సస్ ఇవ్వాలి అంటే ఒక పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో సూర్య నటిస్తున్న ‘మాస్’ తెలుగులో ‘రాక్షసుడు’ గా మారబోతోంది.

చిరంజీవి సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ‘రాక్షసుడు’ 1986 సంవత్సరంలో మంచి విజయం సాధించింది. నాగార్జున నటించిన ‘మాస్’ సినిమా కూడ సూపర్ హిట్ కొట్టినా టాలీవుడ్ ప్రేక్షకులలో నాగార్జున కన్నా చిరంజీవికి ఉన్న క్రేజ్ రిత్యా సూర్య ‘మాస్’ టైటిల్ ‘రాక్షసుడు’ గా మారబోతోంది అని టాక్.

వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావడం ప్రస్తుతం పరాజయాల మధ్య కొనసాగుతున్న సూర్య కెరియర్ కు చాల అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే టాలీవుడ్ మాస్ ప్రేక్షకులకు దగ్గర కావడానికి సూర్య రాక్షసుడు గా మారుతున్నాడు అని అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: