సమీరారెడ్డి చాన్నాళ్ల తరవాత మళ్లీ తెలుగు సినిమాలో నటించింది. మరికొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్, రానాలతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. అవును, కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో ఆమె ప్రత్యేక గీతంలో ప్రత్యేకంగా కనిపించనుంది. ఇందుకోసం క్రిష్, రానాలు ఆమెను ఒప్పించారట. ‘నాకు ప్రత్యేక గీతాల్లో చేయాలని లేదు. కానీ, వాళ్లు చెప్పిన విధానం నచ్చి ఒప్పకున్నాను. సినిమాలలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఇప్పుడు తగ్గిపోయింది. అలాంటప్పుడు ఒక పాట చేసినా సినిమా మొత్తం చేసినా ఒకటే. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బాలీవుడ్ లో హిట్టయిన సినిమాను తెలుగులో తీస్తున్నా కూడా... ఒరిజినల్ సినిమాలోని హీరోయిన్ పాత్రను మార్చేసి, అందులో ఉన్న ప్రాధాన్యం తగ్గించేసి విలువలేకుండా చేస్తున్నారు తెలుగులో. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా కథానాయకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినా నేనెందుకు అనవసరంగా నోరుపారేసుకుని చెడ్డయిపోవడం... నా అవకాశాలను పోగొట్టుకోవడం... నోకామెంట్’ అంటోంది సమీరా. అనాల్సిందంతా అనేశాక నోకామెంట్ అంటే ఏం ఉపయోగం? 

మరింత సమాచారం తెలుసుకోండి: