ఒక సినిమా తెరకెక్కాలంటే దర్శకుడు, నిర్మాత ఉంటే సరిపోదు దానికి తగ్గ హీరో ఉండాలి, ఆ హీరో ఇమేజ్ ని బట్టి కూడా సినిమాలు ఓ రేంజ్ లో అడుతాయి. మరి సినిమాలకు ఆయువు పట్టు అయిన హీరో రెమ్యూనరేషన్లు తెలుగు , తమిళ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక తమిళ సినిమాలు అయితే యూకె, మలేషియా లాంటి దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. 


టాలీవువ్ ఇండస్ట్రీ


రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ , అజితం లాంటి స్టార్స్ నటించిన సినిమాలకు తమిళ ఇండస్ట్రీలోనే కాక టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో బాగానే డిమాండ్ ఉంది  అందుకే వీరికి డిమాండ్  బాగా పెరిగిపోయింది.రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ లాంటి స్టార్ల రెమ్యూనరేషన్ వింటే మన కళ్లు పైర్లు కమ్మాల్సిందే..

తమిళ హీరోలు 


మరి వీళ్ల రెమ్యూనేషన్ ఏ రేంజ్ లో ఉందో చూద్దామా..!


తమిళ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న  రజనీకాంత్ నటించే సినిమాలకు తమిళనాడుతో పాటు తెలుగు, హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇందుకుగాను ఆయన రూ. 30 కోట్ల వరకు తీసుకుంటారట. కేవలం తమిళం సినిమా అయితే రూ. 20 నుండి 25 కోట్లు తీసుకుంటారట.
 
విశ్వహీరోగా గుర్తింపు తెచ్చకున్న హీరోగా  కమల్ హాసన్ సినిమాకు రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతే కాదు  డైరెక్షన్, రచయిత లాంటి బాధ్యతలు కూడా చేపడితే ఎక్స్ ట్రా చార్జ్ చేస్తాడట. 

తమిళనాడులో రజనీ, కమల్ తర్వాత ఫాంలో ఉన్న స్టార్ హీరో విజయ్. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 18 నుండి 20 కోట్లు వరకు తీసుకుంటాడట.

హీరో సూర్య నటించిన సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటారట. దీంతో పాటు తెలుగు రైట్స్ అదనం. తెలుగు రైట్స్ ద్వారా మరో 5 కోట్లు ఆయనకు అదనంగా వస్తాయని అంచనా. 

అజిత్...ఒక్కో సినిమాకు రూ. 18 కోట్ల నుండి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా.

 
హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు తీసుకుంటాడు. ఆయన సినిమాలు తెలుగులోనూ బాగా ఆడతాయి. 

తమిళ హీరో కార్తికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 10 కోట్ల వరకు తీసుకుంటాడట. 

తమిళ హీరో ధనుష్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. 

హీరో శింబు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట 

హీరో ఆర్య ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: