నందమూరి బాలకృష్ణ సీనియర్ నటుడే అయిని ఆయనలో ఎనర్జీ మటుకు ఇంకా తగ్గలేదు. కుర్ర హీరోలకు పోటీగా డ్యాన్స్,ఫైటింగ్స్ చేసి అభిమానులను ఎప్పుడూ రంజింప చేస్తుంటారు. రాజకీయ రంగం వైపు మళ్లినా తను సినిమాలు మాత్రం ఎప్పటికీ వదలను అని బాలకృష్ణ అంటుంటాడు. సింహ,లెజెండ్ ఆయన ఖాతాలో బిగ్గెస్టు హిట్స్ గా నిలిచిపోయాయి. మొన్న వచ్చిన లయన్ కాస్త డిజాస్టర్ గా మిగిలిపోయినా తర్వాత వచ్చే సినిమా కోసం మంచి ఫిట్ నెస్ తో మరింత కొత్త లుక్ తో నటించ బోతున్నాడని తెలుస్తుంది.


డిక్టేటర్ సినిమా షూటింగ్ ఓపెనింగ్ లో బాలకృష్ణ టాలీవుడ్ సెలబ్రెటీలు


తెరపై ఎంత ఎనర్జీగా కనిపిస్తారో.. రియల్ లైఫ్ లో కూడా కాస్త సరదా, కొంటె పనులు చేస్తూ ఉంటారు. ఈ మధ్య సెల్పీఫోటోస్ కూడా బాగానే దిగుతున్నారు. ఇక మంచు మనోస్ సంగీత్ లో బాగానే  హల్ చల్ చేశాడు బాలయ్య. తాజాగా బాలకృష్ణ 99 వ సినిమా డిక్టేటర్ సినిమా ఓపెనింగ్ సందర్భంగా అంజిలిని గిల్లుతూ ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ నెట్ వర్క్ లో హంగామా చేస్తుంది. మరి బాలయ్యా మజాకా..!


మరింత సమాచారం తెలుసుకోండి: