తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా వివాదాలు చెలరేగుతున్నాయి. ఆ మధ్య మూవీ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలుసు. తర్వాత ఈ గొడవ సర్ధుమనిగింది. తాజాగా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పిడిన తెలుగు ఆర్టిస్ట్‌ యూనియన్‌లో ఏర్పడింది ఈ యూనియన్ లో 942 మంది వరకు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ యూనియన్ కి అధ్యక్షులుగా వినోద్ యాదవ్, సెక్రటరీగా వెల్లంకి శ్రీనివాస్, క్యాషియర్ గా విజయ్ కుమార్ లు తమ యొక్క కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురి కుంభకోణం బయటపడింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ


తాజాగా తెలుగు ఆర్టిస్ట్‌ యూనియన్‌ పేరిట ఆంధ్రాబ్యాంక్‌ అకౌంట్‌ నుండి 7 లక్షల 35 వేల రూపాయలను వీరు స్వాహా చేసినట్లుగా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. జూన్‌ 20న జరిగిన సమావేశంలో ఈ విషయం బహిర్గతమై  దీంతో ఆగ్రహించిన   కార్యవర్గ సభ్యులందరూ కలిసి వీరిని యూనియన్‌ నుండి తొలగించడం జరిగింది. అనంతరం తెలుగు ఆర్టిస్ట్‌ యూనియన్‌ అడాక్‌ కమిటీ ఛైర్మన్‌గా వి. చిన్న శ్రీశైలం యాదవ్‌, ప్రెసిడెంట్‌గా వీరారెడ్డిలతో పాటు మరో 10 మంది నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. తెలుగు ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటాము. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ చీకటి కుంభకోణంపై కూడా విచారణ జరపనున్నాము” అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: