తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి అంటే ఓ ప్రత్యేకత ఉంది ఈయన తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఏదీ ఫెల్యూర్ అన్నమాట వినపడలేదు. అంతే కాదు దర్శక ధీరుడుగా, జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి నిగర్వి..ఎక్కడ ఎదగాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేర్పరి. మాటతో మాయ చేయగల దిట్ట. ప్రస్తుతం ఆయన తీసిన ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు, బాహుబ‌లి హిందీ ప్ర‌మోష‌న్ పైనే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడు  అందుకోసం ఆయన ఎక్కువ ముంబైలోనే గడుపుతున్నారు. అంతే కాదు హిందీలో బాహుబలి సినిమా విడుదల చేస్తున్నది దర్శక, నిర్మాత కరణ్ జోహార్.

మక్కి (ఈగ) పోస్టర్


ఇప్పుడు రాజమౌళి హిందీ ప్రమోషన్ లో భాగంగా కరణ్ జోహార్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అయితే గతంలో ఈగ (మక్కీ) బాలీవుడ్ లో అంతమంచిగా ఆడలేక పోయిందని దానికి కారణం అక్కడ సరైన ప్రమోషన్ వర్క్ పబ్లిసిటీ  చేయలేదని బాలీవుడ్ లో స‌రిగ్గా ఆడక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయనని అన్నారు.  కాకపోతే బాలీవుడ్ లో తన గుర్తింపు రావడానికి కారణం మాత్రం మక్కీ సినీమా నే అని అన్నారు.

బాహుబలి పోస్టర్


బాహుబలి విషయంలో అలాంటి భయం లేదని అందుకు కారణం కరణ్ జోహర్ అని చెప్పారు, ఎందుకంటే కరణ్ కి బాలీవుడ్ లో ఇప్పటికే మంచి పేరు ఉందని ఆయన పాపులర్ ఫిగర్ అని స్వయంగా ఆయన చేతిలో ‘బాహుబలి’ పెట్టామని ఇక నిశ్చింతగా ఉండవచ్చు అని తెగ పొగిడేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: