బాహుబలి ఈ సినిమా ఇక రెండు రోజులో ప్రజల ముందుకు వచ్చి కనువిందు చేయనుంది. కానీ ఇప్పటి ‘బాహుబలి’ కి నీలి నీడలు పోలేదు..ఈ సినిమా సంచలనాల  దిశగా అడుగులు వేస్తూందో లేదో కాని వివాదాలతో సంచలనలు సృష్టిస్తుంది.  తెలుగు చిత్ర సీమలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకు ప్రచారం వచ్చింది. భారత దేశం మొత్తం ఈ సినిమా గురింటే టాక్.. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కొత్త వివాదం చెలరేగింది. ఈ సినిమాలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయాని తెలంగాణ మాలల జేఏసీ డిమాండ్ చేసింది.

బాహుబలి పోస్టర్


మాల కులస్తులను అవమానపరిచే మాటలు ఉన్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కులాన్ని అవమాన పరుస్తూ యూట్యూబ్ లో వచ్చిన క్లిప్లింగ్స్ కొన్ని సేకరించి పోలీసులకు అందిస్తూ.. ఫిర్యాదు చేశామని జేఏసీ చైర్మన్ బి. దిపక్ కుమార్ తెలిపారు. ఈ సినిమాపై  ఎంతో ఉన్నతమైన అభిప్రాయాలు ఉన్నాయని అలాంటిది మాల కులస్తులను అవమానపరిచే విధంగా ఉండటం ఒకింత కలవర పరిచిందని  బి. దీపక్ కుమార్ అన్నారు. ఈ దృశ్యాలను తొలగించకుంటే చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: