నిన్న తిరుపతి దగ్గర రేణిగుంట విమాన ఆశ్రయంలో చిరంజీవి ‘బాహుబలి’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యల వెనుక అర్ధాలు ఏమిటీ అంటూ కొందరు అర్ధాలు వెతికే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. రామ్ చరణ్ నిర్వహిస్తున్న ట్రూజెట్ విమాన ప్రారంభోత్సవానికి తిరుపతి వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ‘బాహుబలి’ సినిమా చాల బాగుందని ఎక్కువ రోజులు ఆడాలని ఆకాంక్షించాడు.

అయితే ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఇదే సందర్భంలో చిరంజీవితో మాట్ల్దాడుతూ ‘బాహుబలి’ కి డివైడ్ టాక్ వచ్చిందని ఈ సినిమాకంటే ‘మగధీర’ బెటర్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు అన్న మాటలను చిరంజీవి దృష్టికి తీసుకువచ్చినప్పుడు చిరంజీవి చాల వ్యూహాత్మకంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.

అప్పుడే ఇలాంటి విషయాల పై స్పందించడం చాల ఎర్లీ అవుతుందని కొద్ది రోజులు ఆగితేకాని ‘బాహుబలి’ ఏ స్థాయిలో విజయం అన్న విషయం పై క్లారిటీ రాదనీ అయినా మనతెలుగు వాళ్ళు  అందరూ ‘బాహుబలి’ ని చూసి రాజమౌళిని ప్రోత్సహించాలని కామెంట్ చేసాడు చిరంజీవి.

అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యలు వెనుక అర్ధాలు ఏమిటి అని కొందరు రంద్రాన్వేషణ చేస్తున్నారు. గతంలో చిరంజీవి మెగా స్టార్ గా ఉన్న రోజులలో అతడు నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు మొదటిరోజు నెగిటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత ఇండస్ట్రీ టాప్ హిట్ గా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఇలా కామెంట్ చేసాడు అంటూ కొందరు విశ్లేషణలు చేస్తూ ఉంటే చిరంజీవి మాటలలో మరేదో కొత్త అర్ధాలు ఉన్నాయి అంటూ విశ్లేషణలు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: