తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ తో రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న హాట్ భామ నయనతార. ఈ అమ్మడు శ్రీ రామరాజ్యం సినిమా తర్వాత తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది. ఇప్పటికీ తన గ్లామర్  ఏమాత్రం తగ్గలేదంటూ మంచి డిమాండ్ లో ఉంది నయన్.. ఇప్పటికే నయన్  పెళ్లి విషయాల్లో, లవ్వు విషయాల్లో ఎన్నో వివాదాలు చెలరేగాయి. వాటన్నిటిని పక్కన బెట్టి సినిమాలవైపే దృష్టిపెట్టింది ఈ హాట్ బ్యూటీ. నయనతార చేసిన చివరి లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘అనామిక’.

మాయ (తెలుగులో మయూరి) చిత్రం పోస్టర్


ఈ సినిమా తర్వాత ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ సినిమా ‘మాయ'(తమిళ్ టైటిల్). ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘మయూరి’ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా   తమిళంలో రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుంది. తెలుగులో ఈ సినిమాని సి కళ్యాణ్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 24 న రెండు భాషల్లో రిలీజ్ చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి నయన్ భయపెడుతుందా  వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: