బాలీవుడ్ లో  సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగ్ భాయి జాన్ ’ చిత్రం  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారి స్తాయిలో విడుదల అయిన ఈ సినిమా మంచి కలక్షన్స్ సాదిస్తుంది. ఈ సినిమాను ముంబైలో ప్రముఖ హీరో అమీర్ ఖాన్ చూసాడు. సినిమా చూసేటపుడు కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయని సల్మాన్ ఖాన్ యాక్షన్ అద్భుతంగా ఉందని పొగిడారు. ఒక పాకిస్తాన్ బాలికను తన సొంత ఇంటికి చేర్చడానికి ఓ భారతీయుడు పడ్డ కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

బజరంగ్ భాయి జాన్ పోస్టర్


అద్భతమైన సెంటిమెంట్ తో ఈ సినిమా చూస్తున్నంత సేపు హృదయం చలించిపోయిందని దాంతో కన్నీళ్లు వచ్చాయని అన్నారు. సల్మాన్ ఖాన్ సినిమా చరిత్రలో ఇదో అద్భుతమైన చిత్రంగా మిగిలిపోతుంది. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.  అంతే కాదు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని అయన అన్నారు. పన్ను మినహాయింపు చేస్తే ఆ సినిమా ద్వార వచ్చిన ఆదాయం ప్రజల కోసమే ఖర్చు పెట్టినట్టు అవుతుందని అన్నారు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: