గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం రుద్రమదేవి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రన్ని విడుదలకు సిద్దం చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలని ముమ్మరం చేసింది. తెలుగు ఇండస్ట్రీలో ‘అలా మొదలైంది’ సినిమాలో నానితో చాలా క్యూట్ గా కనిపించిన మళియాళి కుట్టి నిత్యామీనన్ కు ఈ మద్య బాగా కలిసి వస్తుంది.


‘రుద్రమదేవి’ ముక్తాంబగా నిత్యమీనన్


 తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు ఈ అమ్మడు ఫుల్ బిజీ.. మణిరత్నం ఓకే బంగారం సినిమాతో ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. తాజాగా గుణశేఖర్ నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రంలో ఈ అందాల భామ ముక్తాంబగా కనిపించ బోతుందట. రుద్రమదేవి గా అనుష్క నటించగా రాకుమారి ముక్తాంబగా నిత్యమీనన్ కనిపించ బోతుందట.

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రలో అందాల భామ అనుష్క నటించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటించాడు. చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా నటించాడు. ఈ చిత్రంలో అనుష్క , రానా , అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు..కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.ఇక త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం రుద్రమదేవి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రన్ని విడుదలకు సిద్దం చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలని ముమ్మరం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: