బాలీవుడ్ ఫిల్మ్ఇండస్ట్రీలో గత దశాబ్ధ కాలానికి పైగానే ఈద్ ఫెస్టివల్ కి బిటౌన్ సిల్వర్ స్ర్కీన్స్ వద్ద పండుగ వాతావరణం కనపడుతూ వస్తుంది. ఈద్ పండుగ సందర్భంగా పెద్ద పెద్ద హీరోల మూవీలు రిలీజ్ అవుతాయి. మినిమం ఇద్దరు పెద్ద హీరోలు అయినా ప్రతీసారి ఈద్ కి రిలీజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే 2016 ఈద్ పండుగకి పెద్ద హీరోల మూవీలు రిలీజ్ అవుతున్నాయి.

అయితే ఆ పోటీ ఇప్పుడు గొడవ దిశగా మారుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రీసెంట్ గా ఈద్ సందర్భంగా విడుదలైన 'బజరంగీ భాయిజాన్' సినిమా.. మరోసారి సల్మాన్ ఖాన్ సెంటిమెంట్ ను నిలబెట్టి... 500 కోట్ల మార్క్ ను దాటి దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే... నెక్స్ట్ ఈద్ వరకూ ఏ సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్న విషయంపై ఫుల్ క్లారిటీగా ఉంది బాలీవుడ్.

ఈ ఏడాది ఈద్ కు సోలోగా వచ్చి.. సల్మాన్ కోట్లు కొల్లగొడితే.. వచ్చే ఏడాది ఈద్ పండగకు మాత్రం.. షారుక్ తో గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నాడు సల్మాన్. వచ్చే ఈద్ కు సల్మాన్ సుల్తాన్ సినిమాతో పాటు.. షారుక్ ఖాన్ రాయిస్ మూవీ కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అప్పుడే ప్రకటించారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ని అస్సలు పడదు. కాని ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య స్నేహ వాతావరణం నెలకొంది.

ఇద్దరూ ఒకరిపై ఒకరు చలోత్తులు విసురుకుంటున్నారు. దీంతో షారుఖ్, సల్మాన్ అభిమానులు ఇదంతా షాకింగ్ లా మారింది.  అయితే 2016లో ఈద్ ఫెస్టివల్ నాటికి వీరిద్దరి తిరిగి గొడవ పెట్టుకొని, వారి మూవీలపై హైప్ క్రియేట్ చేసుకుంటారని..ప్రస్తుతం ఇప్పుడు స్నేహంగా ఉన్నప్పటికీ తరవాత వీరు చేసే గొడవ..వారి మూవీలపై హైప్ క్రియేట్ చేసుకోవటం కోసమే అని ...బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: