ఈ మాట అంటున్నది హీరో మంచు విష్ణు వర్థన్. ఈ మధ్య ‘దేనికైనా రెడీ’తో మళ్లీ హిట్టు కొట్టాడు. హిట్టు కోసం చాలా రోజులు వేచిచూశాడు విష్ణు. అయితే... తన సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ తనే తీసుకుంటాడట. అలాగే వాటి ఫలితాల బాధ్యత తనదే అంటున్నాడు. ‘ఒక సినిమా ఫ్లాపయినా హిట్టయినా దానికి సంబంధించిన నైతిక బాధ్యత నాదే. ఫ్లాప్ అయితే దానికి కారణం ఫలానా వారని నేను నెట్టేయను. తప్పు నావల్ల జరిగితే.... నేనే చేశానని ధైర్యంగా ఒప్పుకుంటాను. నా కెరీర్ లో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం ‘సలీమ్’ చిత్రం చేయడం. షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆ చిత్రం ఆడదని అర్థమైపోయింది. ఆ సినిమాలో నాన్న నటించమని బలవంతపెట్టి మరీ ఒప్పించాను. ఫలితం ముందే ఊహించాను కాబట్టి... పెద్దగా బాధపడలేదు. కానీ, సినీ పరిశ్రమలో పుట్టి పెరిగాక కూడా ఇలాంటి తప్పు ఎందుకు జరిగిందా అని కొన్నాళ్లు ఆలోచించాను. దాన్నో పాఠంగా మార్చుకున్నాను. అలాంటి తప్పు మళ్లీ దొర్ల కూడదనే ‘దేనికైనా రెడీ’ చిత్రానికి సంబంధించి అన్ని విషయాలు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాను. అనుకున్నట్టే విజయం సాధించింది’ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: