అనుష్క లావెక్కిపోయిది. ఏకంగా 20 కిలోలు బరువు పెరిగిపోయింది. అసలేంటీ అమ్మాయి.. పోల్చుకోలేని విధంగా మారిపోయింది... ఇలాంటి కామెంట్లు ప్రస్తుతం సినీప్రియుల మధ్యలో బీభత్సంగా షికారు చేస్తున్నాయి. దర్శకేంద్రుని పుత్రరత్నం సూర్యప్రకాష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైజ్‌ జీరో చిత్రం కోసం అనుష్క ఏకంగా 20 కిలోలు లావెక్కిపోయినట్లుగా వార్తలు హోరెత్తిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు అనుష్క అభిమానుల గుండెల్లో బాంబులు పెట్టినట్లుగా పేలుతున్నాయి. కానీ.. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అనుష్క లావెక్కడం అంతా ఉత్తుత్తిదేనంట. ఏదో సినిమాకు హైప్‌ తీసుకురావడం కోసం.. ఆమె సినిమాకోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగిందంటూ.. రిలీజ్‌చేసిన పోస్టర్లను చూపించి మాయ చేస్తున్నారట. 


వివరాల్లోకి వెళితే.. సినిమాకోసం బరువు పెరగడమూ, తగ్గడమూ, సిక్స్‌ప్యాక్‌లు పెంచడమూ, తీసేయడమూ చేసే హీరోల గురించి మనకు తెలుసు. ఇదంతా చాలా ప్రత్యేకమైన.. దేశవ్యాప్తంగా సంచలనం కాగల చిత్రల కోసం హీరోలు ప్రత్యేకంగా చేసే కసరత్తు. గతంలో అభయ, అపరిచితుడు, ఐ తదితర చిత్రాలకోసం కమల్‌హాసన్‌, విక్రం లాంటి వారు ఎన్నికసరత్తులు చేశారో అందరికీ తెలుసు. ఇదికూడా అలాంటిదే అని అంతా ఊదరగొడుతున్నారు. కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి.. ఇదంతా ఉత్తుత్తికేనట. నిజానికి చిత్రంలో లావుగా కనిపించాల్సిన అనుష్క గెటప్‌ను కేవలం మేకప్‌తోనే మేనేజి చేశారుట. అయితే.. అనుష్క బరువు పెరిగిందంటే.. అది సంచలనం కాబట్టి.. అలా ప్రచారం చేస్తూ సినిమాకు హైప్‌ తెస్తున్నారు. 


నిజానికి సినిమాల ప్రచారంలో భాగంగా ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడడం కొత్త కాదు. గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 'మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులూ...' అంటూ పాట పాడినప్పుడు.. ఆయన సుదీర్ఘంగా సాగేచరణం మొత్తాన్ని మధ్యలో శ్వాస ఆపకుండా.. ఒక్క గుక్కలో పాడేశారంటూ వార్తలు బీభత్సంగా వచ్చాయి. ఆ పాట రికార్డింగు తర్వాత.. ఆయన వారం రోజుల పాటూ వేరే పాటలు ఏవీ పాడలేకపోయారని.. గొంతు దెబ్బతిన్నదని కూడా వార్తలు వచ్చాయి. ఆ పాట ద్వారా సినిమాకు బాగా హైప్‌ క్రియేట్‌ అయింది. 


ఇటీవల ఆయన ఒక టీవీ కార్యక్రమంలో ఆ పాట పాడేసి.. ఇందులో గుక్క తిప్పుకోకుండా పాడానని ఎవరైనా అంటే మీరు నమ్మవద్ద. ఇప్పుడు కూడా గుక్క ఆపాను. మీకు తెలియకుండా.. ఆపాను. అప్పట్లో ఇళయరాజా నేను చిన్న ట్రిక్కులు ప్లే చేసి.. ఎవ్వరూ గుర్తించకుండా అలా చేశాం. ఒక్క గుక్కలో పాడడం ఎవ్వరికీ సాధ్యం కాదు.. ఎవ్వరూ ట్రై చేయవద్దు అంటూ తెగేసి చెప్పారు. అంటే అప్పట్లో వచ్చిన వార్తలన్నీ.. మాయమాటలే అని తేలిపోయింది. ఇప్పుడు అనుష్క బరువు పెరగడం కూడా అలాంటి వ్యవహారమే అని.. కేవలం మేకప్‌తో మేనేజి చేసి.. ఆమె బరువు పెరిగిందంటూ ప్రచారం కోసం సరదాకు చెబుతున్నారని సినిమాకు సంబంధించిన వాళ్లే లీక్‌ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: