నిన్నటిరోజున సాయంత్రం ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తనతో నటించిన హీరోయిన్స్ కు ట్యాగ్స్ ఇవ్వడమే కాకుండా ఆ హీరోయిన్స్ ను తనతో లింక్ చేస్తూ అప్పటి మీడియాలో వచ్చిన వార్తల పై చిరంజీవి ఇప్పుడు స్పందించాడు. ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ప్రెజంటర్ చిరంజీవి మెగాస్టార్ గా వెలిగిపోయే రోజులలో అతడిని హీరోయిన్ రాధికను లింక్ చేస్తూ వచ్చిన వార్తల పై స్పందించవలసిందిగా డైరక్ట్ గా అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఏ మాత్రం ఖంగుతినకుండా సమాధానం ఇచ్చాడు.

రాధిక తనకు ఒక మంచి స్నేహితురాలు అని అంటూ ఇప్పటికీ తమ మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉందని అంటూ సుహాసిని, సుమలత కూడ తనకు మాత్రమే కాకుండా తన భార్య సురేఖకు కూడ ఆప్తమిత్రులు అని కామెంట్ చేసాడు చిరంజీవి. ఇప్పటికీ తనతో నటించిన చాలామంది హీరోయిన్స్ ను 1980 హీరోయిన్స్ క్లబ్ తో తాను ప్రతి సంవత్సరం ఆగష్టులో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటామని ఈ సంవత్సరం కూడ ఆగష్టు 29న తన హీరోయిన్స్ ను కలవబోతున్నట్లు అసలు విషయాన్ని బయట పెట్టాడు చిరంజీవి.

ఇదే సందర్భంలో తనతో నటించిన ప్రముఖ హీరోయిన్స్ కు ఒకే ఒక పదంతో ట్యాగ్ లు ఇచ్చాడు మెగా స్టార్. తనతో అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించిన రాధిక – చిలిపి, మాధవి – కళ్ళతోనే నటించే నటి, రాధ – మంచి డాన్సర్, సుహాసిని – ట్రెడిషనల్ హీరోయిన్, విజయశాంతి – గ్లామర్ హీరోయిన్, శ్రీదేవి – నటన కోసమే పుట్టిన అతిలోక సుందరి అని చెపుతూ తన హీరోయిన్స్ కు ట్యాగ్ లు ఇచ్చాడు చిరంజీవి. 

ఇప్పుడు తన 150వ సినిమా హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేసుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు కాజల్, తమన్నా, సమంత అనుష్క, నయనతార ఇలా ఎన్నో ఆప్క్షన్స్ ఉన్నా కథను బట్టి తన హీరోయిన్ ఎంపిక ఉంటుందని ఇప్పుడు నేను ఏమి చెప్పలేను అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు చిరూ..


మరింత సమాచారం తెలుసుకోండి: