తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మొదట్లో ఫ్లాపులు చవి చూశారు. కానీ తన ఇమేజ్ మాత్రం పెంచుకుంటూ వచ్చాడు.. మాస్ ఫాలోయింగ్ బాగా సంపాదించిన పవన్ కళ్యాన్ డిఫరెంట్ మ్యానరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక త్రివిక్రమ్,పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా,అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇక అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ వెండి తెరపై దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది కనిపించి అయితే మద్య గోపాల గోపాల సినిమా వచ్చినప్పటికీ అది గెస్ట్ రోల్ మాత్రమే.. ఇప్పుడు మళ్లీ మెగా అభిమానుల రంజింప చేయడానికి పవర్ దర్శకుడైన బాబీతో కోత్త సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు పదిహేనున విడుదల చేశారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో అదిరిపోయే షాక్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కబీర్ దుహాన్ సినిమాలో మెయిన్ విలన్ గా వస్తున్నాడా..? లేక మరికొందరు విలన్లు ఉన్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.. ! ఏది ఏమైనా  ‘జిల్' సినిమాతో తెరంగ్రేటం చేసిన కబీర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో చేసే అవకాశం దక్కడంపై చాలా సంతోషంగా ఉన్నాడు.  


జిల్ చిత్రంలో గోపీ చంద్, కబీర్ దుహాన్ సింగ్


వాస్తవానికి జిల్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో మనోడికి అస్సలు పేరు రాలేదు... ఇప్పుడు పవన్ కి విలన్ గా చేయడం అంటే..నాట్ ఏ జోక్ అని  కబీర్ దుహన్ సింగ్ అంటున్నాడు. వన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కలువ కళ్ల సుందరి కాజల్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. చిత్రానికి జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. . ఈ చిత్రం టీజర్ ని సైతం విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: