ఈ మద్య కాలంలో బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. శృంగారభరిత సీన్లు, లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్లు సర్వ సాధారణమైపోయాయి. అంతే కాదు అక్కడ దర్శక,నిర్మాతలకు ఇలాంటి చిత్రాలు కల్పవృక్షంగా మారాయి. భారీ స్థాయిలో సెట్టింగ్స్ వేసి,భారీ బడ్జెట్ తో పెద్ద పెద్ద హీరో,హీరోయిన్లతో సినిమాలు తీసి చేతులు కాల్చుకునే బదులు చిన్న చిన్న హీరోయిన్లు,హీరోలతో ఒక థ్రిల్లర్,కామెడీ,హర్రర్ లాంటి సినిమాలు తీస్తూ అందులో పుష్కలంగా మసాలా జోడించి సినిమా మమా అనిపిస్తేచాలు విపరీతమైన కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి.

తాజాగా ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం “కట్టి బట్టి”. ఈ సినిమాలో ఒక పాట కోసం ఇమ్రాన్ ఖాన్,కంగనా రౌనత్ పై ఓ పాట చిత్రీకరించారు..ట్విస్ట్ ఏంటంటే ఈ పాట కోసం హీరో హీరోయిన్ లు ముద్దుల్లో మనిగిపోయారట. లిప్ టూ లిప్ కిస్సియాన్ అనే పాట చిత్రీకరణ సమయంలో ఇమ్రాన్, కంగనలు రోజుకు 8 గంటల చొప్పున మూడు రోజులు తమ పెదవులకు పని చెప్పారని సమాచారం. కంగనా రౌనత్ లిప్ లాక్ సీన్ అస్సలు వెనకాడలేదట.. పైగా ఆ సీన్లో పరిపూర్ణంగా లీనమైపోయిందట.. దీంతో పాట మరింత రక్తి కట్టించడానికి ఎక్కువ సమయమే తీసుకున్నట్లు తెలుస్తుంది.

కట్టి బట్టి హాట్ సీన్లో ఇమ్రాన్ ఖాన్,కంగనా రౌనత్


లిప్ టూ లిప్ కిస్సియాన్ పాటను అద్భుతంగా చిత్రించామని, ఈ పాటలో ఇమ్రాన్, కంగనలు లీనమైపోయి ఆడిపాడారని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. నిఖిల్ అడ్వాణీ దర్శకత్వం వహిస్తున్న కట్టి బట్టి ఈ పాట హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.  ఇదో థ్రిల్లర్ మూవీ అని కంగనా ఇదివరకే చెప్పింది. గతంలోనే ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. నిఖిల్ అడ్వాణీ దర్శకత్వం వహిస్తున్న కట్టి బట్టి చిత్రం సెప్టెంబరు మూడో వారంలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన సీన్లు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కంగనా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: