శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు పండుగుల సందడి మొదలు అవుతుంది. మన హైందవ సంస్కృతి లో పరమ పవిత్రమైన మాసమే కాదు దేశానికి జీవనాధారమైన పoటలకు కీలిక మాసం శ్రావణ మాసం. ఈ సంవత్సరం అంతా  సర్వ శుభాలతో గడిచి శ్రావణ మేఘాల నుంచి మంచి వర్షాలు వచ్చి మంచి పంటలు తమ ఇంటికి రావాలని భాగ్యాలు కలుగ చేయాలని కోరుకుంటూ మన తెలుగు రాష్ట్రాలలో స్త్రీలు అత్యంత భక్తి భావoతో ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.  అష్టలక్ష్మీలుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చేసే ఈపూజలో అణువణువునా తెలుగు సాంప్రదాయం తొణికిసలాడుతుంది  


ఈశానాం జగతోస్య వేంకట పతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థల నిత్యవాసి రసికాం తక్షాంతి సంవర్థనీం
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసన స్థాం శ్రీయం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్’’
‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. ఇదే జీవ బ్రహ్మైక్యస్థితి. ఆ స్థితిని ప్రసాదించే శ్రీ శక్తి శ్రీ మహాలక్ష్మి.సంపాదనకు మూలదారనైన జ్ఞాన ఇచ్ఛాశక్తులను మనలో నిండుగా ప్రవహింపజేసి, నిద్రాణమైన శక్తినికలిగించి అందరినీ రక్షించమని స్త్రీలు ఈరోజు ఈ వ్రతాన్ని చేస్తారు.  మంచి పనులు, మంచి ఆలోచనలు ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అంటారు.

మహాలక్ష్మి సర్వదా చిరునవ్వు చిందించే ప్రసన్న వదన. పంచమి నాటి చంద్రకళలో మహాలక్ష్మీ వైభవం కనపడుతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి అర్థo వరలక్ష్మి వ్రతంలో ఉంది. అక్షరమనగా నాశనములేని ‘తత్వములు’ నాశన రహితమైన పదిహేను తత్త్వాలుకలిగిన దేవిగా లక్ష్మిని ఆరాధిస్తాం.  శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో మొదటి నామయైన ‘ప్రకృత్యై నమః’’ అన్న నామంలోని ప్రకృతితత్త్వం మహాలక్ష్మీ పరతత్త్వాన్ని విసదీకరిస్తుంది.


శ్రీ మహాలక్ష్మి ఈశ్వరి అయిన లక్ష్మీదేవి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అణచి, భక్తులకు పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనమును, ధాన్యాన్ని పశు సంపదను, అనుగ్రహించి కరుణించాలని  ఆ శ్రీమహాలక్ష్మిదేవిని కోరుతూ ఈ రోజు ప్రతి ఇంటిలో పూజలు జరుగుతాయి ‘మంగళప్రదాయిని... సదా నమస్తే మహాలక్ష్మీ’ అంటూ నేడు జరిగే వరలక్ష్మి పూజలు మన తెలుగు సాంప్రదాయానికి నిదర్శనంగా జరుగుతున్న ప్రతి ఇంటిలోనూ   అష్ట ఐశ్వర్యాలు కలగాలని  ఎపి హెరాల్డ్ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.. 




మరింత సమాచారం తెలుసుకోండి: