రీసెంట్ గా రిలీజ్ అయిన నాని 'భలే భలే మగాడివోయ్' సినిమా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈగ తర్వాత నాని భారీ హిట్ అందుకుంది ఈ సినిమాతోనే. అయితే మారుతి ఈ కథని అసలు నాని కోసం రాసుకున్నది కాదట. ప్రేమకథా చిత్రం సినిమా చేస్తున్న టైంలోనే అల్లరి నరేష్ కు ఈ సినిమా కథను వినిపించాడట అయితే నరేష్ ఈ కథకు అతగా ఇంప్రెస్ అవ్వలేదట. ఆ తర్వాత ఇదే కథను మారుతి కమెడియన్ కం హీరో సునీల్ కు వినిపించాడట. అయితే స్టోరీ నచ్చినా సునీల్ తనను మెమొరీ లాస్ క్యారక్టర్లో ప్రేక్షకులు చూడలేరని నో చెప్పాడట.  

వారిరువురు కాదన్న ఈ సబ్జెక్ట్ నాని ఓకే చెప్పడంతో నాని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే హీరో కోసం సతమతపడుతున్న మారుతికి హీరోగా నానిని తీసుకోమని సలహా ఇచ్చింది మాత్రం యు.వి. క్రియేషన్స్ వారట. గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు యు.వి క్రియేషన్స్ వారు కూడా నిర్మాణ భాధ్యతలు చూసుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే మెమొరీ లాస్ క్యారక్టర్లో నాని అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.


ఒకందుకు నరేష్, సునీల్ కాదన్నందుకే నానికి ఈ సినిమా వచ్చి హిట్ అయ్యింది కాబట్టి వారిద్దరికి నాని థాంక్స్ చెప్పినా తప్పేం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన లావణ్య కూడా మంచి అభినయంతో నటించి ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. సినిమా మొత్తం కామెడీని నింపి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు డైరక్టర్ మారుతి. పతాక సన్నివేశాల్లో నాని యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా నానికే కరెక్ట్ అని, మారుతి సెలక్షన్ సూపర్ అని కొనియాడుతున్నారు.


సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. భలే భలే మగాడివోయ్ సినిమాలో నటించి నాని నిజంగానే భలే మగాడివోయ్ 
అనిపించుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: