తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయిన పవన్ కళ్యాన్ ఫస్ట్ సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’  అంతగా పేరు రాకపోయినా తర్వాత వచ్చిన తొలిప్రేమ, సుస్వాగతం,తమ్ముడు,గోకులంలో సీత లాంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయ.. అయితే ఈ సినిమాలతో పవన్ తన అద్భుతమైన నటన కనబరిచాడు.. ఇక ఖుషి సినిమాతో చాలా స్టయిలిష్ గా కనబడ్డాడు..అద్భుతమైన పాటలు,ఫైట్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  అప్పటి వరకు వచ్చిన సినిమాలతో అంతంత మాత్రంగానే పేరు వచ్చినా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాతో మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించాడు పవన్.. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండి తెరకు పరిచయం అయినా ఆయన ఇమేజ్ ఏమాత్రం ఎక్కడా వాడుకోకుండా తన మ్యానరిజంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఇక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలతో నెం.1 పొజీషన్లో ఉన్నాడు. ఇప్పుడు ‘ సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాన్ ని ఓ స్టార్ డైరెక్టర్ తెగ పొగిడేస్తున్నాడు.. అప్పట్లో   పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెలుగులో ‘పంజా’ అనే ఓ స్టైలిష్ సినిమా చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణు వర్ధన్. తాజాగా తమిళంలో ‘బిల్లా’, ‘ఆరంభం’ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణు వర్ధన్, తాజాగా ‘యాట్చన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పంజా సినిమా చాలా అద్భుతమైన చిత్రం అని చాలా మంది అన్నారు.. ఈ సినిమా కొంత మందికి నచ్చక పోవచ్చు.. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా పవన్ ని కలిసినపుడు ఈ సినిమా గురించి చాలా బాగా మెచ్చుకుంటారు.

పంజా చిత్రం పోస్టర్


పవన్ తన కెరీర్ లో మంచి స్టయిలిష్ సినిమా అని మెచ్చుకుంటాడు.. వాస్తవానికి పవన్ కళ్యాన్ తో సినిమా తీయడం అంటే అదృష్టాంగానే భావించాలి ఎందుకంటే ఆయన హీరోగా ఎప్పుడు గర్వపడడు..నిర్మాతలకు, దర్శకుల చాలా బాగా సహకరిస్తారు.. వారి కష్టనష్టాలు అడిగి తెలుసకుంటారు.. అంతే కాదు ఆయన ఎంత నిజాయితీగా ఉంటాడో దర్శక, నిర్మాతలు కూడా అంతే నిజాయితీగా మెసలుకోవాలి.. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ లాంటి హీరోలు ఉండటం అదృష్టం. ఆయనతో కలిసి సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభూతి” అంటూ దర్శకుడు విష్ణు వర్ధన్‌ పవన్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: