ఈనెలలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ ‘అ ఆ’ (అనసూయ రామలింగం వెర్సెస్ ఆనంద్ విహారి) టైటిల్ తో పాటు ఆ సినిమాలో నటిస్తున్న నటీనటుల పేర్లు బయటకు రావడంతో సమంత ‘అనసూయ రామలింగం’ గా నితిన్ ఆనంద్ విహారిగా ఈ సినిమాలో కనిపిస్తారు అని అను కున్నారు అంతా. 

అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ త్రివిక్రమ్ మరో షాక్ ఇవ్వబోతున్నాడు. ఈసినిమాలో ‘అనసూయా రామలింగామం’ గా కనిపించ బోతున్నది నదియా. ఆమె కూతురుగా సమంత నటిస్తూ ఉంటే నదియా అల్లుడుగా ఆనంద్ విహారి పాత్రలో నితిన్ కనిపించ బోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

అత్తా అల్లుళ్ళ యుద్ధoలో ఒకరి పై ఒకరు ఎత్తులు వేసుకునే ఈకథ  గతంలో వచ్చిన చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ కథ షేడ్స్ లో నడుస్తూ సినిమా అంతా నదియా నితిన్ లమధ్య నడుస్తూ ఉంటుందని టాక్. ‘అత్తారింటికి దారేది’ సినిమా ఘన విజయంలో నదియా పాత్రకు ఏర్పడిన క్రేజ్ రీత్యా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ త్రివిక్రమ్ మరోసారి నదియాను రంగంలోకి దిమ్పుతున్నాడు అని టాక్. 

ఈసినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి రేస్ కు తీసుకు వద్దామన్న త్రివిక్రమ్ ప్లాన్ చూస్తూ ఉంటే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఒక భారీ హిట్ పై త్రివిక్రమ్ కన్నేసాడా అనిపించడం సహజం ఈ అత్తా అల్లుళ్ళ వార్ చూడాలి అంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: