టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గర్తింపుని  తెచ్చుకున్న హీరో నాని. నాని ఇప్పటి వరకూ నటించిన చిత్రాలు, తాజాగా నటించిన చిత్రం వేరు. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తరవాత నాని జాతకం పూర్తిగా మారిపోయిందంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు. ప్రస్తుతం నాని ఓ మూవీకి తీసుకుంటున్న రెమ్యునరేషన్  రెండు కోట్ల రూపాయలు.


అయితే భలే భలే మగాడివోయ్ మూవీకి నాని తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు కోటి రూపాయలకు మించదు. కానీ, సినిమా సాధించిన ఫ్రాఫిట్ చూస్తే సుమారు 30 కోట్ల రూపాయలకు మించి ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ అనంతరం నాని దాదాపు 4 చిత్రాలకి కమిట్మెంట్స్ ని ఇచ్చాడు. 


ఒక్కో మూవీకి నాని వసూలు చేస్తున్న రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. నాని ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ పెంచటానికి కారణం తన మార్కెటే అని చెబుతున్నాడు. భలే భలే మగాడివోయ్ మూవీ గ్రాండ్ సక్సెస్ కారణంగా నిర్మాతలకి 30 కోట్ల రూపాయల లాభం. నాని హీరోగా ఓ మంచి కథ సాధించిన కలెక్షన్స్ ఇవి.


అందుకే ఓ మంచి కథతో రండి, రెమ్యునరేషన్ మాత్రం 4 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటున్నాడు నాని. కనీసం 15 కోట్ల రూపాయలు వసూల్ చేసినా నానికి అంతటి రెమ్యునరేషన్ ఇవ్వటానికి ఏముంది ఇబ్బంది అని...నాని ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిర్మాతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: