బాలీవుడ్ లో కపూర్ వారసత్వం నుంచి వచ్చి యంగ్ స్టయిలిష్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేశవ్ నగర్ కు చెందిన రాజత్ బన్సాల్ అనే న్యాయవాది ఈ మేరకు మదియాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరితో పాటు ఆన్ లైన్ మాధ్యమంగా వస్తువుల అమ్మకాలు జరుపుతున్న ‘ఆస్క్ మీ బజార్ డాట్ కాం’ డైరెక్టర్లు సంజీవ్ గుప్తా, ఆనంద్ సోన్ భద్ర, పీయుష్ పంకజ్, కిరణ్ కుమార్, శ్రీనివాస మూర్తి, మార్కెటింగ్ ఆఫీసర్ పూజా గోయల్ లపైనా కేసులు పెట్టినట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే….ఫార్హాన్ అఖ్తర్, రణబీర్ కపూర్ లు ఇద్దరూ ‘ఆస్క్ మీ బజార్ డాట్ కాం’ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.


'ఆస్క్ మి బజార్' అనే ఆన్లైన్ షాపింగ్ సైట్ కోసం వినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు ఇచ్చారని, ఉద్దేశ పూర్వకంగా కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..  రాజత్ బన్సాల్ అనే న్యాయవాది 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ కోసం ఆగస్టు 23న 'ఆస్క్ మి బజార్'లో ఆన్ లైన్ షాపింగ్ చేశానని, తన డెబిట్ కార్డు ద్వారా రూ. 29,999 కూడా చెల్లించానని, ముందుగా ప్రకటించిన తేదీల్లో తాను ఆర్డరు చేసింది రాకపోగా, బిల్లు మాత్రం పంపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ హామీ ఇచ్చిన విధంగా 10 రోజుల్లో ప్రొడక్టు డెలివరీ కావాల్సి ఉండగా, ఎన్నిమార్లు సంస్థ అధికారులను కాంటాక్ట్ చేసినా సరైన సమాధానం రాలేదు.


ఇక తప్పని సరి పరిస్థిితిలో బన్సాల్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే  ఆన్ లైన్ షాపింగ్ సైట్ కు రణబీర్, ఫరాన్ అక్తర్ లిద్దరూ ప్రకటన లిచ్చారని, వాటిని చూసి తాను మోసపోయానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.సదరు ఆన్లైన్ షాపింగ్ సైట్ డైరెక్టర్లపై కూడా 420, 406 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఆస్క్ మి బజార్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ డైరైక్టర్లపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: