తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నిత్యం ఒక గొడవ రగులుతూనే ఉంటుంది. ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి అలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాం.. అని పరిశ్రమ అంటుంది. అవే సినిమాలు తీస్తున్నారు గనుక.. తప్పదు కాబట్టి చూస్తున్నాం.. అని ప్రేక్షకులు తిట్టుకుంటూ ఉంటారు. చెట్టు ముందా? విత్తు ముందా లాంటి సమస్య ఇది! అయితే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుల అభిరుచి మీదికే రుద్దేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నంలో తాజాగా పవన్‌కల్యాణ్‌ మాజీ డైరక్టర్‌.. రాంచరణ్‌ హిట్‌ చిత్రం మీద కూడా సెటైర్లు వేస్తున్నాడు. 


వివరాల్లోకి వెళితే.. గబ్బర్‌సింగ్‌ డైరక్టర్‌ హరీష్‌శంకర్‌ తాజాగా దర్శకత్వం వహించిన సుబ్రమణ్యం సేల్‌ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించినప్పుడు అనేక సంగతులు చర్చించారు. ఇందులో భాగంగా ఫార్ములా సినిమాల ముచ్చట కూడా వచ్చింది. సినిమా సక్సెస్‌కు ఫార్ములా తెలిస్తే.. అన్ని సినిమాలు హిట్‌ అవుతాయి కదా అంటూనే మనది హీరో బేస్డ్‌ ఇండస్ట్రీ అని తేల్చేశారు హరీశ్‌ శంకర్‌. ఒక సినిమా ఫ్లాపయితే.. దర్శకుడికి అవకాశాలు రావడం ఆగిపోతున్నదే తప్ప.. హీరోకు అవకాశాలు ఆగిపోవడం లేదు కదా.. అన్నది ఆయన స్వానుభవంలోంచి నేర్చుకున్న పాఠం. 


80 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రావాలంటే.. హీరో వందమందిని నరికితే కాని కుదర్లేదని హరీశ్‌ అన్నారు. అంటే ప్రేక్షకుల అభిరుచి అంత అడ్డగోలుగా ఉంటోంది అన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. కానీ ఆ డైలాగే డైరక్టుగా.. రాంచరణ్‌ మగధీర చిత్రం మీద సెటైరే అని స్పష్టంగా తెలిసిపోతోంది. వాళ్ల అభిరుచి మేరకే సినిమాలు తీయాలి తప్ప.. మన అభిరుచిని వాళ్ల మీద రుద్దకూడదు.. అంటూ మళ్లీ చెట్టుముందా.. విత్తుముందా డైలాగు వేస్తున్నారు హరీశ్‌!!


మరింత సమాచారం తెలుసుకోండి: