మహేష్ బాబు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మూవీ శ్రీమంతుడు. శ్రీమంతుడు మూవీలో మహేష్ రెమ్యునరేషన్ లాంటివి తీసుకుకోకుండా భాగస్వామ్య నిర్మాతగా వ్యవహరించాడు.

దీంతో మూవీ రిలీజ్ అనంతరం, శ్రీమంతుడుకి వచ్చిన బిజినెస్ లోనూ, లాభాల్లోనూ వాటాను తీసుకున్నాడు. ఇక దాదాపు శ్రీమంతుడు బిజినెస్ క్లోజ్ అయినట్టే అని చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ శ్రీమంతుడు మూవీ దాదాపు 170 కోట్ల రూపాయలను టచ్ చేసిందనే టాక్స్ వినిపిస్తున్నాయి.

శాటిలైట్, ఓవర్సీస్, ఇండియా, ఇంర్నెట్ రైట్స్ ఇలా అన్ని కలుపుకొని శ్రీమంతుడు అనుకున్నదాని కంటే భారీగానే బిజినెస్ ని చేసింది. దీంతో మహేష్ కి వచ్చిన లాభాలను చూస్తే దాదాపు 78 కోట్ల రూపాయలు లెక్క తేలింది. ఈ లాభాలను చూసిన మహేష్ బాబుకి ఒక్కసారిగా షాకింగ్.

ఇప్పటి వరకూ ఒక్కోమూవీకి 40 కోట్ల రూపాయలవకూ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న మహేష్ బాబు, ఒక్కసారిగా 78 కోట్ల రూపాయలను ఒక్క మూవీతో చూడటంతో ఆనందానికి హద్ధే లేకుండా పోయింది. అందుకే తనకు వచ్చిన ఇంతటి లాభాలకి కారణం అయిన డైరెక్టర్ కి, 50 లక్షలతో ఆడి కారుని గిప్ట్ గా ఇచ్చాడు. మహేష్ కి వచ్చిన లాభాలను చూసి ఇతర నిర్మాతలు  సైతం ఆశ్ఛర్యపోతున్నారంట. మొత్తంగా మహేష్ అద్రుష్టవంతుడే. 



మరింత సమాచారం తెలుసుకోండి: