మెగా హీరోల ఫంక్షన్స్ ఏమి జరిగినా ముఖ్యంగా చిరంజీవి సినిమా ఫంక్షన్లు ఏమి జరిగినా అక్కడ ఖచ్చితంగా కనిపించే నాగబాబు నిన్న జరిగిన ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో కనిపించకపోవడం చాల మందిని ఆశ్చర్య పరిచింది. దీనితో ఈ వేడుకకు వచ్చిన చాల మంది అతిధులు నాగబాబు ఎందుకు రాలేదు అంటూ నెమ్మదిగా గుసగుసలాడుకున్నట్లు టాక్. 

ఇక చిరంజీవి షష్టిపూర్తి ఫంక్షన్ లో జరిగిన సంఘటనల రీత్యా పాస్ లు ఇవ్వడoలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఆడియో వేడుకలో పవన్ నామస్మరణ లేకుండా ప్రశాంతంగా జరిగి పోయింది అనే వార్తలు వస్తున్నాయి. నిన్న విడుదలయిన  ‘బ్రూస్ లీ’ ట్రయిలర్ లో ఫ్యామిలీ సెంటిమెంట్స్, మాస్ కు నచ్చే ఫైట్లు, పాటలు, యూత్ కు నచ్చే డైలాగులు, ఫన్ అన్నీ ట్రయిలర్ లో వుండేలా చూసారు.

‘కోడల్ని తెచ్చుకునేది స్టేటస్ కోసం కాదు లేని కూతుర్ని తెచ్చుకోవడానికి’ అన్న డైలాగు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానచ్చే అవకాశముంది. సుజుకీ సుబ్రహణ్యం అంటూ బ్రహ్మీ నవ్వుల పంచ్ లు  ‘జుట్టు మనదే కదా అని మనమే కట్ చేసుకోం కదా’ అంటూ పోసాని వేసిన డైలాగ్ సెటైర్లు రామ్ చరణ్ డైలాగ్ ‘ఎలగెలగ’ ను వెరైటీ గా రిపీట్ చేసిన రకుల్ గ్లామర్ లుక్స్  తో విడుదలైన ‘బ్రూస్ లీ’ ట్రైలర్ మెగా అభిమానులకు బాగా నచ్చుతుంది. 

‘బ్రూస్ లీ’ సినిమాను థ్రిల్లర్ సినిమాగానో, యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమానో కాకుండా మెగా అభిమానులకు నచ్చే విధంగా ఉంటుంది అన్న సంకేతాలు ఈ ట్రైలర్ ద్వారా వచ్చేలా చేశారు. ఏమైనా పవన్ గురించి ఎటువంటి ప్రస్తావనలు లేకుండా ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుక జరగడంతో అటు చిరంజీవి ఇటు చరణ్ లు హ్యాపీగా ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: