తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా చిన్నతనంలోనే వెండితెరపై హంగామా సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మస్ ఫాలోయింగ్ సంపాదించాడు.. బాలకృష్ట తర్వాత ఆ రేంజ్ లో నందమూరి అభిమానుల అభిమానం సంపాదించిన హీరో ఎన్టీఆర్ ఈ సంవత్సరం ‘టెంపర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా సుకుమార్  దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మూడు నెలలు లండన్ లో జరుపుకుంది..ఇందుకోసం ఎన్టీఆర్ స్టయిల్ కూడా పూర్తిగా మార్చాడు.

ఇటీవల ఈ చిత్ర విషయాల గురించి దర్శకుడు సుకుమార్ కొన్ని విషయాలు వెల్లడించాడు.. అదీకూడా ఎన్టీఆర్ ని తెగ మెచ్చుకుంటూ.. లండన్ లో షూటింగ్ జరిగే సమయంలో అక్కడ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి..అయితే నిర్మాత కోరిక మేరకు ఎన్టీఆర్ ఒక్కరికి మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో ఉండటానికి ఏర్పాటు చేసి మిగత చిత్ర యూనిట్ మామూలు హోటల్ లో బస చేశారట. అయితే ఎన్టీఆర్ మటుకు అక్కడ కేవలం మూడు రోజులు మాత్రమే బసచేసి ఆయన కూడా హోటల్ ఖాళీ చేసి టీమ్ తో కలిసి మామూలు హోటలో బస చేశారట.

ఈ మద్య కాలంలో హీరో, హీరోయిన్లు ఎంతో లగ్జరీ మెయింటేన్ చేస్తూ నిర్మాతలను నానా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఎన్టీఆర్ మాత్రం చాలా సింపుల్ గా చిత్ర యూనిట్ తో గడిపారట.. అంతే కాకుండా ఎలాంటి హంగులూ ఆర్భాటాలు చేయకుండా టీమ్ తో చాలా బాగా ఎంజాయ్ చేశారట. మొదటి నుంచి డబ్బు విలువ తెలిసిన వ్యక్తి కావడంతో ఇలా సింపుల్ లైఫ్ గడపడం ఎన్టీఆర్ కి  అలవాటని నిర్మాతలు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామన్నా వాటిని తిరస్కరిస్తారని అందుకే నిర్మాతలు,దర్శకులు ఆయనంటే ఇష్టమని సుకుమార్ అన్నారు.

నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్


ఎన్టీఆర్ సింప్లిసిటీకి చిత్రబృందంతోపాటు దర్శకనిర్మాతలు సైతం అభినందన తెలిపారు. షూటింగ్ సమయంలో కూడా దర్శక,నిర్మాతల పరిస్థితిని అడిగి తెలుసుకుంటాడని ఎక్కువ షాట్స్ తీసుకోకుండా అద్భుతమైన నటన కనబరుస్తారని..ఇలాంటి హీరో దొరికితే ఏ నిర్మాతకైనా ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌కు 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో..'  రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రితిసింగ్ నటిస్తుంది.. ఇందులో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: