ప్రపంచంలో ఉగ్రదాడిని నిరసిస్తూ అన్ని దేశాలు ఒకే తాటిపై నిలబడ్డాయి. ఉగ్రవాదులను తుద ముట్టించేందుకు ఇప్పటికే రష్యా రంగంలోకి దిగింది.  తాము వైట్ హౌస్‌తో పాటు న్యూయార్క్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని ఐఎస్ఐఎస్ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో   ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, బోకోహారమ్ తదితర ఉగ్రవాద సంస్థలు ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని అమెరికా పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులపై అమెరికా మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసింది.  కొత్త టెక్నాలజీ ఉపయోగించి అమెరికా దాడులు నిర్వహిస్తుంది. ద్రోన్ ల ద్వారా చేసిన దాడిలో పదమూడు మంది ఉగ్రవాదులు హతమయ్యారని వార్తలు వస్తున్నాయి. వీరిలో పాకిస్తాన్ తాలిబన్ నేత సయ్యద్ సజ్నా కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ మద్య కాలంలో ఆప్ఘన్ లో జరిపిన పెద్ద దాడులలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: