సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పోలీసుల కంట్లో పడింది. వెంటనే ఆ వీడియో గురించి అన్ని వివరాలు సేకరించారు. ఆ వీడియోను ఎవరు, ఎక్కడ చిత్రీకరించిందో తెలుసుకుని వారందరినీ అరెస్ట్ చేశారు. సౌదీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా...? కొందరు స్త్రీలు, మరికొందరు పురుషులు ఫుల్లుగా మందుకొట్టి డాన్స్ చేశారు. రాత్రంతా గోలగోల చేశారు. మస్తుగా పార్టీ చేసుకున్నారు.