పేదరికం కావొచ్చు..డబ్బు సంపాదించాలన్న ఆశ కావొచ్చు ఏది ఏమైనా విదేశాల మోజులో పడి చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బు, ఆస్తులు వెచ్చించి బయటి దేశాలకు వెళ్తుంటారు.  చాలా మంది వరకు అక్కడ మోసాలకు బలి అవుతూ తిరిగి స్వదేశానికి ఎప్పుడు వస్తామా అని ఎదురు చూపులు చూస్తుంటారు.  గత కొంత కాలంగా పని పేరిట గల్ఫ్‌కు వెళ్లే వారి పరిస్థితి చాలా దుర్భరంగా తయారవుతుంది.  
Related image
ఇవన్నీ తెలిసినా కొంత మంది దళారుల చేతిలో మోసపోతూ డబ్బు సంపాదించొచ్చు అన్న ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు.  కొంత మంది పని పేరిట గల్ఫ్‌కు మహిళలను పంపుతో వారిని అక్కడ అంగడి సరుకుగా అమ్మిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి.  తాజాగా పని పేరిట గల్ఫ్‌కు మహిళలను పంపుతున్న ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు.  
Image result for gulf countries
గత కొంత కాలంగా కరీంనగర్‌ జిల్లా కోరుట్ల ప్రాంతం నుంచి మహిళలను ఈ ఏజెంట్లు పని పేరిట గల్ఫ్‌కు పంపుతున్నారు.  అక్కడకు వెళ్లిన మహిళలు సరైన పనులు లభించక ఎన్నో చిత్ర హింసలకు గురి అవుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇబ్బందులు పడ్డ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గల్ఫ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న బాబు, గంగాధర్‌లను అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: